Rain Alert: ఆంధ్రప్రదేశ్ కు మరొకసారి తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వేరువేరు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో 13న అల్పపీడనం ఏర్పడి 14న వాయుగుండం గా మారుతుందని తెలిపింది. ఇది 15 తేదీ నాటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడు 15వ తారీకున తీరం దాటుతుందని అంచనా వేశారు.
AP NEWS: ఈవీ వాహనదారులకు… ఏపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తరువాత సముద్రం వెంబడి బలమైన గారు వీచే అవకాశం ఉండటం వలన తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు పడనున్నాయి. దీని ప్రభావంతో ఈనెల 14, 15, 16 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి.
కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
One thought on “Rain Alert: ఏపీ కి పొంచివున్న తుఫాను ముప్పు”